అన్నం తింటే లావవుతారా? వైద్యులు చెప్పిన అసలు నిజం!
- బియ్యంలో 15కిపైగా ముఖ్యమైన పోషకాలు
- శరీరానికి, మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తుంది
- గ్లూటెన్ లేని సహజ ఆహారం
- ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది
- బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
బరువు తగ్గాలనుకునే చాలామంది ముందుగా ఆహారంలో నుంచి అన్నాన్ని తీసేస్తుంటారు. ‘అన్నం తింటే లావవుతాం’ అనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. అయితే ఈ ఆలోచన పూర్తిగా సరైనది కాదని పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు. తరతరాలుగా మన ఆహారంలో భాగమైన అన్నానికి భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. సరైన పరిమాణంలో, సమతుల ఆహారంలో భాగంగా తీసుకుంటే అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు.
పోషకాలతో నిండిన ఆహారం
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహారంగా ఉపయోగించే బియ్యంలో 15కిపైగా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో థయామిన్, నియాసిన్, విటమిన్-బీ6 వంటి విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం వంటి ఖనిజాలు లభిస్తాయి. అలాగే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లకు బియ్యం మంచి వనరు. ఇవే మనకు రోజువారీ శక్తిని అందిస్తాయి.
శరీరానికి శక్తినిచ్చే ఇంధనం
బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రధాన ఇంధనంగా పనిచేస్తాయి. ఇవి క్రమంగా జీర్ణమవడం వల్ల శక్తి ఒకేసారి కాకుండా క్రమంగా కొంత సమయం వరకు అందుతూ ఉంటుంది. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. శరీరంతో పాటు మెదడుకు కూడా అవసరమైన శక్తి లభిస్తుంది. చక్కెరలు అధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్‌లా వెంటనే శక్తి తగ్గిపోకుండా స్థిరంగా ఉంచడంలో అన్నం దోహదం చేస్తుంది.
గ్లూటెన్ లేని సహజ ఆహారం
గోధుమ, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ కొందరికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాంటి వారికి అన్నం మంచి ప్రత్యామ్నాయం. బియ్యం సహజంగానే గ్లూటెన్ రహిత ఆహారం. అందువల్ల గ్లూటెన్ నిరోధకత కలిగిన వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని తీసుకోవచ్చు.
ఎందుకు పూర్తిగా మానేయకూడదు?
బియ్యం తినడం వల్లే బరువు పెరుగుతారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అసలు సమస్య అధిక పరిమాణంలో తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మొత్తం ఆహారపు అలవాట్లలో ఉంటుంది. పప్పులు, కూరగాయలు, ప్రొటీన్‌తో కలిపి సరైన మోతాదులో అన్నం తింటే అది బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌లో భాగమవుతుంది.